prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 2:33 pm Digital Edition : ASHOK THIRUPATHI

బోయకొండ గంగమ్మ కు లక్ష కుంకుమ అర్చన

బోయకొండ గంగమ్మకు లక్ష కుంకుమ అర్చన

న ప్రజావాణిచౌడేపల్లి ఫిబ్రవరి 06

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దినదినాభివృద్ధి చెందుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న లక్ష కుంకుమార్చన ప్రతి సంవత్సరం మాఘమాసం వేళ నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం మరియు వేద పండితులు గోవర్ధన శర్మ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అమ్మవారికి విశేషాలు మరియు ఉభయదారుల చేత అర్చన కార్యక్రమాలు కొనసాగించారు. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది మూడు రోజులకు గాను దాదాపు 560 మంది దంపతులు కుంకుమార్చన లో పాల్గొన్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలియజేశారు. కుంకుమార్చన లో పాల్గొన్న దంపతులకు వివిధ రకాల వస్తువులు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆలయానికి విచ్చేసిన ఉభయ దారులకు మరియు భక్తాధులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో ఉప కమిషనర్ కోరారు. అమ్మవారి సేవలో పాల్గొని కరుణకు పాత్రులు అయ్యారని ఆయన ఈ సందర్భంగా అన్నారు లక్ష కుంకుమార్చన మూడురోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ఆలయ అధికార సిబ్బంది భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సన్నిధానంలో యాగ శాల లో లక్ష కుంకుమకుమార్చనలో పాల్గొన్న భక్తులు కొంతమంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక అధికార సిబ్బంది పాల్గొన్నారు.