బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి…. డిప్యూటీ కమిషనర్‌కు కాంగ్రెస్ నేత బొక్క ప్రభాకర్ రెడ్డి వినతి

ఘట్‌కేసర్, జూలై 22 : ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో త్వరలో నిర్వహించనున్న బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఘట్‌కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా బొక్క ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి,...