prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 4:48 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

బోధన్ రోటరీ క్లబ్ సౌజన్యంతో బాలికలకు సైకిళ్ల పంపిణీ.

బోధన్ రోటరీ క్లబ్ సౌజన్యంతో బాలికలకు సైకిళ్ల పంపిణీ.

 

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ కోటగిరి పాఠశాలలో చదువుతున్న 15 మంది బాలికలకు రోటరీ క్లబ్ బోధన్ వారి సౌజన్యంతో శనివారం సైకిళ్లను పంపిణీ చేశారు.బాలికల విద్యను ప్రోత్సహించేందుకు చేసిన ఈ సేవా దృక్పథానికి రోటరీ క్లబ్ బోధన్ అధ్యక్షులు ఓంకార్ శ్రీనివాస్ రాజు కార్యదర్శి అల్లే రమేష్,సభ్యులకు కోటగిరి గ్రామ సర్పంచ్,మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయు లు,మండల విద్యాధికారి ఎన్.శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు కోటగిరి అధ్యక్షులు బర్ల సాయిలు,ప్రధాన కార్యదర్శి ఉదయ్ చందర్,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.