prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:29 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

బోడ మాణిక్యం తండాలో ఎన్నికల హామీలపై వివాదం

బోడ మాణిక్యం తండాలో ఎన్నికల హామీలపై వివాదం

చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి

మండల పరిధిలోని బోడ మాణిక్యం తండాలో ఎన్నికల హామీల అమలుపై గ్రామస్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ 5వ వార్డు సభ్యుడు బోడ మంగ సుమన్, సీనియర్ నాయకులు భూక్య బాలాజీ, శ్రీను, రాజులు తనకు 3 లక్షలు ఇస్తామని చెప్పి మద్దతు పొంది, ఇప్పుడు ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని తేజావత్ విజయ్ ఆరోపించారు. హామీలు కాగితాలకే పరిమితమని వారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మాధవ రెడ్డి, మండల నాయకులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించి తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.