prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 10:06 am Digital Edition : PRAJA VANI

బోడుప్పల్ లో ప్రభుత్వ భూమి కబ్జా..?

దాదాపు పదేళ్లుగా షెడ్లు నిర్మించి కిరాయిలతో హవా..

బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు

ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైడ్రాకు కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 262లో సుమారు రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు పదేళ్లుగా ఆ స్థలంలో షెడ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మేడిపల్లి జూలై 24(మన ప్రజావాణి) బోడుప్పల్ సర్కిల్ పరిధిలో సర్వే నెంబర్ 262 లో కబ్జాలో ఉన్న సుమారు 20 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పులకండ్ల బాల్ రెడ్డి, పోగుల వీరారెడ్డి లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు వారు బోడుప్పల్ లో విలేకరుల సమావేశంలో ప్రభుత్వ భూమి కబ్జా వివరాలను వెల్లడించారు.బోడుప్పల్ లోని సర్వే నెంబర్ 262 లో సుమారు అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిని బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.అనంతరం ఆ స్థలంలో భారీ షెడ్లు నిర్మించి దాదాపు పదేళ్లుగా అద్దెలు వసూలు చేస్తూ వ్యక్తిగత ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని ఆక్రమించి వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని ఫిర్యాదుదారులు ఆరోపించారు.సర్వే నంబర్ 262కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు,ఇతర అధికారిక పత్రాలను పరిశీలిస్తే ఆక్రమణల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని,అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించాలని,ప్రభుత్వ భూమిని ఆక్రమించి అద్దెలు వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను పోగుల వీరారెడ్డి,పులకండ్ల బాల్‌రెడ్డి తమ ఫిర్యాదులో కోరారు.ఈ ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా, రెవెన్యూ శాఖలు ఎలాంటి చర్యలు చేపడతాయన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.