బోడుప్పల్ కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
మేడిపల్లి జూలై 23 (మన ప్రజావాణి) బోడుప్పల్ లోని కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యబృందం అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి ఓ పేషెంట్ను పేషంట్ ను ప్రాణాపాయం నుంచి కాపాడి అందరిమన్ననలను పొందగలిగారు.అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు దాదాపు అయిదు గంటలపాటు నిర్వహి పేషెంట్కు మళ్లీ ప్రాణం పోశారు.పూర్తి వివరాలను శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్య బృందం గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.గోడమీద నుంచి కిందపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ ను ఎమర్జెన్సీ ఎక్స్ ప్లోరేటరీ లాపరోటమీతో పాటు,థొరాకోటమీ నిర్వహించి ఓమెంట ప్యాచ్ రిపేర్ చేయడంతో పాటు డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా రిపేర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు. ప్రస్తుతం పేషెంట్ తమ పర్యవేక్షణ కోలుకుంటున్నారని వెల్లడించారు.అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ను వైద్యులు డాక్టర్ సాయిభార్గవ్(లాపరోస్కోపిక్ సర్జన్)డాక్టర్ అరుణ్ కనాల (థొరాసిక్ సర్జన్) డాక్టర్ జి.క్రాంతి కిరణ్ ( క్రిటికల్ కేర్ అనస్తీషియా నిపుణులు డాక్టర్ కృష్ణస్వామి(పల్మనాలజిస్ట్) లు విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు కృషి చేశామని సందర్బంగా కేకే స్వర ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ మోటే మాట్లాడుతూ సమయానికి సరైన నిర్ధారణ వైద్యబృందం సమన్వయం.ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. అత్యవసర,సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందించడం తమ ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఇతర ఆసుప త్రులతో పోల్చితే తమ ఆసుపత్రిలో క్లిష్టమైన ఆపరేషన్లను తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా వైద్య సేవలను తక్కువ వ్యయంతో అందించడానికి తమవంతు కృషి చేస్తున్నామని శ్రీకాంత్ మోటే వివరించారు.ఈ సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ రవీందర్.ఆర్ఎంవో డాక్టర్ కుమారస్వామి లతో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.