బొలినేని మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు పటిష్ట పోలీస్ బందోబస్తు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ, ఎస్పీ
ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిడమర్రులో నిర్వహించిన బొలినేని మెడికల్ కాలేజీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, వీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు మరియు ప్రజల రాకపోకలకు...