prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బొలినేని మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు పటిష్ట పోలీస్ బందోబస్తు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ, ఎస్పీ

ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిడమర్రులో నిర్వహించిన బొలినేని మెడికల్ కాలేజీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, వీఐపీ మార్గాలు, హెలిప్యాడ్ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు మరియు ప్రజల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుస్థాయి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్, ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, మహిళల భద్రత చర్యలు, బాంబ్ డిస్పోజల్ మరియు డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందితో విస్తృత స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ATV రవికుమార్,ఏ హనుమంతు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ అలహారి శ్రీనివాస్, ఇతర డీఎస్పీలు, సీఐలు,ఎస్సైలు మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు