prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:24 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

బొక్క ప్రభాకర్ రెడ్డికి ఘన సన్మానం

ఘట్‌కేసర్, జూలై 6: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొక్క ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు శాలువా కప్పి అభినందనలు తెలియజేసి, ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బొక్క ప్రభాకర్ రెడ్డి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో 6వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ కడుపోల్ల మల్లేష్, రాధాకృష్ణ ముదిరాజ్, డాక్టర్ మల్లేష్, కోరుబోతూ నాగరాజు, మీసాల సుధాకర్ రావు, కే. రాజు, కే. సుధాకర్, ఎంఎస్‌కే సల్మాన్ రాజు, మోత్కుపల్లి శ్రీను, నర్సింగరావు, తోక మల్లేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.