బైబిల్ మిషన్ గుత్తి చర్చిలో చిన్న పిల్లలకు ఘనంగా అక్షరాభ్యాస మహోత్సవం: ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రెసిడెంట్ డా. జె. అద్భుతకుమార్

గుత్తి:జూలై 13 ప్రజావాణి ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అత్యంత భారీ చర్చిగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకున్న గుత్తి బైబిల్ మిషన్ చర్చి మళ్లీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక,విద్యా కార్యక్రమానికి వేదికైంది.సమాజంలో అక్షరజ్ఞానం పెరగాలని,చిన్న పిల్లలు ఉన్నత చదువులు చదివి దేశానికి మంచి భవిష్యత్తును అందించాలనే సత్సంకల్పంతో చర్చి నందు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస (విద్యారంభ) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు డా.జె.అద్భుతకుమార్ అయ్యగారు స్వయంగా పాల్గొని చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం...