prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:07 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో దళిత విద్యార్థులకు సీట్లు కేటాయించాలి – పాలడుగు నాగార్జున

*బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో దళిత విద్యార్థులకు సీట్లు కేటాయించాలి – పాలడుగు నాగార్జున*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బి ఎస్) క్రింద దళిత విద్యార్థి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వమే పూర్తి వ్యయ భారం భరించి నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేయడం వల్ల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పేర్కొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కి కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం కొన్ని పరిమిత ప్రైవేట్ పాఠశాలలకే బి ఎస్ స్కీం పరిమితం కావడం వల్ల అనేక మంది దళిత విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సెయింట్ ఆల్ఫోన్సస్, లిటిల్ ఫ్లవర్ వంటి ప్రముఖ పాఠశాలల్లో బిఇఎస్ స్కీం కింద సీట్లు కేటాయించబడ్డారని గుర్తుచేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తున్న పేద దళిత, గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను ఒప్పించి బిఇ ఎస్ స్కీం కింద ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని క్రింది ప్రముఖ విద్యాసంస్థల్లో బి ఎ ఎస్ స్కీం అమలులో ఉంది. ఎస్పిఆర్ స్కూల్, ఎంవిఆర్ స్కూల్, ఏకలవ్య స్కూల్, సెయింట్ ఆల్ఫోన్‌సస్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్, వేదాంత స్కూల్, గీతం మోడల్ స్కూల్, మూర్తి స్కూల్, స్రవంతి స్కూల్, విపస్య స్కూల్, ఓక్ విద్యార్ధి పాఠశాల విద్యార్థుల పాఠశాలలకు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన పాఠశాలల విద్యా సంస్థలకు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెంటనే సంబంధిత పాఠశాలల విద్యా సంస్థలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాయి. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ జిల్లా నాయకులు మాతంగి రవికుమార్ నిర్వహించారు.