బెల్ట్ జోరు దమ్ముంటే పట్టుకోండి బడి గుడి దగ్గర బెల్టు షాపులు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు పోలీసులకు సవాలుగా బెల్ట్ షాపుల నిర్వాహణ

ప్రజావాణిన్యూస్(మార్చి23)పోరుమామిళ్ల మండలంలోని అన్ని గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులు ఊరూరా విచ్చలవిడిగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నుంచి జిల్లా ఎక్సైజ్ అధికారులు వరకు హెచ్చరించినప్పటికీ యదేచ్చగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.మరోవైపు బెల్టు షాపులకు అమ్మకాలు చేసిన వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సీఎం హెచ్చరికలు జారీ చేసిన అవేవీ పట్టించుకోకుండా బెల్టు షాపుల నిర్వాహనకు సిండికేట్ మద్యం దుకాణాలకు దుకాణదారులు పూర్తిస్థాయిలో ప్రోత్సహించడంతో ప్రతి గ్రామంలో...