prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 12:38 pm Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు

విద్యుత్ సిబ్బందికి అవగాహన కల్పించి,సేఫ్టీ కిట్ల పంపిణీ చేసిన

ఏడిఈ సుదీర్ బాబు

బెజ్జంకి, మే4(ప్రజావాణి )

విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి బెజ్జంకి, కోహెడ మండలాల విద్యుత్ సిబ్బందితో కలిసి ఎడిఈ సుదీర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎడిఈ సుధీర్ బాబు మాట్లాడుతూ విద్యుత్ లైన్లు పరికరాల మరమ్మతుల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేసి,విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్న తరువాతే పనులు ప్రారంభించాలని,ఆలా చేస్తే ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
అదేవిధంగా ప్రజలకు కూడా విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ కిట్లు, ఇతర భద్రతా పరికరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి, తోటపల్లి, కోహెడ, బస్వాపూర్ ప్రాంతాల ఏఈ లు మహేష్, అశోక్, రవీందర్, మనోజ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.