శకటోత్సవం సందర్భంగా ముందస్తుగా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న
బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య
బెజ్జంకి, ఏప్రిల్ 1(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతరను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రజలను కోరారు.గురువారం నిర్వహించనున్న శకతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆమె తెలిపారు. జాతరలో పాల్గొనే వారు ఎడ్లబండ్లు లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ యొక్క డ్రంక్ అండ్రీ డ్రైవ్క్ష పరీక్షల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.జాతర విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్సై సౌజన్య విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్, బెజ్జంకి పోలీసులు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.