prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 10:35 am Digital Edition : RAJASHEKARREDDYBEJJANKI BEJJANKI

బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా న్యాయమూర్తుల దర్శనం

బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా న్యాయమూర్తుల దర్శనం

బెజ్జంకి,ఏప్రిల్ 5(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా న్యాయమూర్తులు దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సాయి రమాదేవి,అదనపు జిల్లా న్యాయమూర్తి జయ ప్రసాద్లకు ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రభాకర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.