బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి
బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలి కేంద్రమంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయకమిటీ బృందం బెజ్జంకి,ఏప్రిల్ 5(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం ఆలయ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.ఈ యొక్క వినతిపత్రంలో భాగంగా గుట్టపై ఉన్న ఆలయం చుట్టూ అదనంగా 15 మీటర్ల స్థలం పెంచేందుకు పిల్లర్లు వేసి స్లాబ్ నిర్మాణం చేయాలని,...