బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్
బెజ్జంకి, ఏప్రిల్సి 2(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సిద్దిపేట సి పి సాధన రష్మీ పేరుమాళ్ జాతరకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం నిర్వహించి, పూర్ణకుంభంతో ఆతిథ్యాన్ని ప్రకటించారు.
తదుపరి కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడ్డాయి. స్వామివారికి ప్రత్యేక అర్చన ద్వారా తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి సౌజన్య, ఆలయ చేర్మన్ జెల్ల ప్రభాకర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.