బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి

బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య బెజ్జంకి,మార్చి31(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతరను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రజలను కోరారు. గురువారం నిర్వహించనున్న శకతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆమె తెలిపారు. జాతరలో పాల్గొనే వారు ఎడ్లబండ్లు లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు...