prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 5:14 pm Digital Edition : RAJASHEKARREDDYBEJJANKI BEJJANKI

బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విజయవంతానికి అందరూ సహకరించాలి బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య

బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలి

శకటోత్సవ వేడుకల్లో మద్యం తాగి పట్టుబడితే బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య

బెజ్జంకి,మార్చి31(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతరను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రజలను కోరారు.
గురువారం నిర్వహించనున్న శకతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆమె తెలిపారు. జాతరలో పాల్గొనే వారు ఎడ్లబండ్లు లేదా ఇతర వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.జాతర విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్సై సౌజన్య విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.