బెజ్జంకి మోడల్ స్కూల్లో ఉద్రిక్తత – పీటీ, ప్రిన్సిపల్‌పై విద్యార్థినుల ఆందోళన
బెజ్జంకి, జూలై 20 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలో పీటీ, ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఏయ్ బక్కదాన అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే తిడుతున్నారని వారు పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులు కూడా పీడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్సై తిరుపతి ఘటనాస్థలానికి చేరుకొని విద్యార్థినులు, తల్లిదండ్రులు...