prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:30 am Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి మండల కేంద్రంలో పందుల బెడదతో ప్రజల ఇబ్బందులు – మండల అధికారులకు వినతి

బెజ్జంకి, ఏప్రిల్ 17(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జనావాసాల మధ్య పందుల పెంపకంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందుల వల్ల దుర్వాసన, కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పలు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం స్థానికులు బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ప్రవీణ్, బెజ్జంకి ఎస్సై సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. పందుల బెడద నుండి తమను రక్షించాలని, ఆరోగ్య సమస్యలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.