“బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వెంటనే భర్తీ చేయాలి”– సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్

  బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నెలకొన్న సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన PHCను సందర్శించి వైద్యాధికారితో ఆసుపత్రి సమస్యలపై చర్చించి, చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి,24 గంటల వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక...