prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 8:45 am Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి పోలీసుల హెచ్చరిక రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి

బెజ్జంకి, మే 16(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీసులు గ్రామ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో లేదా ఆరు బయట నిద్రిస్తున్న వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరారు:
రాత్రి సమయంలో బయట నిద్రించకుండా ఉండాలి
బంగారు గొలుసులు, ఆభరణాలు ధరించి నిద్రించవద్దు
ఇంటి తలుపులు, గేట్లు బిగించి ఉంచాలి
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలి
పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు
ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని బెజ్జంకి పోలీసులు తెలిపారు.