prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 8:58 am Digital Edition : RAJASHEKARREDDYBEJJANKI BEJJANKI

బెజ్జంకి గ్రామంలో పందుల పెంపకంపై గ్రామస్తుల ఆగ్రహం తక్షణ చర్యలకు సర్పంచ్ హామీ

బెజ్జంకి,ఏప్రిల్ 13(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జనావాసాల మధ్య పందుల పెంపకం జరుగుతుండటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని సర్పంచ్ బొల్లం శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు.గ్రామ ప్రజలు మాట్లాడుతూ పందుల వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని పందులను జనావాసాలకు దూరంగా తరలించేలా చూడాలని సర్పంచ్‌ను కోరారు.
దీనిపై స్పందించిన సర్పంచ్ బొల్లం శ్రీధర్,సమస్యపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుమాల మహేష్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.