10 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ గాజ రవళి -శ్రీనివాస్
బెజ్జంకి, ఏప్రిల్ 12(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ గాజ రవళి–శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధియే తన లక్ష్యమని తెలిపారు.గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్, భైర సంతోష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.