బెజ్జంకిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన – మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్

  బెజ్జంకి, మే 27(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల పార్టీ కార్యాలయాన్ని మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో కార్యాలయాలు కీలకమని డా. రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీమతి కనగండ్ల కవిత...