prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:26 am Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకిలో ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు

 

బెజ్జంకి,ఆగష్టు1(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు అభినందనలు తెలిపారు. ప్రజా రవాణాలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తూ,ప్రతి రోజు వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు.మూడు చక్రాలపై ప్రయాణం.. వెనక వేలాది కుటుంబాల శ్రమజీవనం” అనే సందేశంతో ఆటో డ్రైవర్ల కష్టాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.ఎండ, వాన, చలి తేడా లేకుండా ప్రజలకు సేవలందిస్తున్న ఆటో కార్మికుల శ్రమ సమాజానికి ఆదర్శమని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.