prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 4:26 pm Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకిలో ఈ నెల 23న హిందూ మహా సమ్మేళనం

హిందూ మహాసభ సమ్మేళన పోస్టర్ నీ ఆవిష్కరించిన సర్పంచ్ బొల్లం శ్రీధర్

బెజ్జంకి, ఏప్రిల్ 17(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఈ నెల 23న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఈ నెల 23న సాయంత్రం బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. హిందూ సమాజానికి చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు. అలాగే తిరుమల సరస్వతి శిశు మందిర్ మాతృమండలి ప్రతినిధి రాణి ప్రియాంక హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.