బెజ్జంకిలోని ఎస్సీ హాస్టల్‌ నీ సందర్శించిన బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్

బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎస్సీ హాస్టల్‌ను, సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ కళ్యాణపు శ్రీకాంత్ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ బాయ్స్ హాస్టల్ లోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్‌ను సందర్శించారు.అనంతరం హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి, అవసరమైన మెరుగుదలలు చేయాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.