prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:38 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బెంగాల్ ,అస్సాం,పుదుచ్చేరి విజయంపై పోరుమామిళ్ల బీజేపీ కార్యకర్తల సంబరాలు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) పోరుమామిళ్ల :బెంగాల్,అస్సాం,పుదుచ్చేరి విజయంపై పోరుమామిళ్ల బీజేపీ కార్యకర్తల సంబరాలు పశ్చిమ బెంగాల్ అసోం,పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయాలకు సంకేతంగా పోరుమామిళ్ల బిజెపి ఆద్వర్యం లో సంబరాలు అంబరాన్నంటాయి.పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నాగేంద్ర,నాయకత్వంలో పార్టీ శ్రేణులు,కార్యకర్తలు బాణాసంచా కాల్చి,స్వీట్స్ పంపిణి చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమం లో జిల్లా GS ఉట్టి శ్రీనివాసుల,సీనియర్ నాయకులూ రమణాచారి,జిల్లా కార్యదర్శి పండరి,మండల ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి  నాయకుడు సాయి,భారత్,వెంకటేష్,అభిషేక్,రాము,రామస్వామి,కిసాన్ మోర్చా జయరాం,కార్యవర్గ సభ్యుడు రవీంద్ర,నగిరి రమణ,సిద్దు,సుబ్బారాయుడు,వెంకట సుబ్బయ్య,బాల చంద్ర,చిన్నయ్య,రమణ చెన్నయ్య,ఇమ్రాన్,రవి కుమార్,సత్య ,జిలాని,మధు,వంశి,గురు,సునీల్,సురేంద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు