prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 5:38 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బీసీల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం :సాకేనరేష్

అనంతపురం (ప్రజావాణి జూన్ 18) బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా బీసీలకు చేసింది ఏమి లేదని నిధులు లేని బీసీ కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్ల నియామకం తప్ప ఏమి చేయలేదని రాష్ట్రం లో బీసీ కార్పొరేషన్లు దిష్టి బొమ్మలా ఉన్నాయని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి వెన్నుగా ఉంటే అధికారం లోకి వచ్చిన తరువాత బీసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు,అదేవిధంగా ఇచ్చిన హామీలలో 50ఏళ్ళు దాటిన వారికి పెన్షన్,నిరుద్యోగ భృతి,18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500,ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు,ఆదరణ పథకం అమలు తో పాటు పేదలను పూర్ టు రిచ్ చేస్తానని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు.హామీల అమలు కోసం బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి,రజక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్,ఉపాధ్యక్షులు మధు,సహాయకార్యదర్శి కదిరిప్ప,మురళి,వెంకటేష్,రామ్మోహన్,లింగమయ్య,శ్రీరాములు,నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.