prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:06 am Digital Edition : PRAJA VANI

బీసీలపై దాడులు చేస్తే ఊరుకోం వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం 

వైసిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి , కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు బిల్లే మంజునాథ్

అనంత పురం జూలై 21 మన  ప్రజా వాణి
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బిసిల మీద దాడులు, భూ కబ్జాలు, హత్యలు మితిమిరిపోతున్నాయి అని వైసిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా మంజునాథ్ విమర్శించారు.ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గలలో బిసిల సత్తా చూపిస్తాం …
ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గములో అధిక శాతంలో ఉన్న బిసి కులస్తుల లో కురుబలు, బోయలు మీద హత్యలు,దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
రాప్తాడు నియోజకవర్గములో ఈ మధ్య కాలంలో 2024 నుంచి 2026 వరకు అంటే ఈ 2ఏళ్లలో కురుబ,బోయ కులస్తులను ఇద్దరిని హత్య చేశారు. మరికొందరి మీద దాడులు చేశారు.ఈ సందర్భంలో బిసిలకు  కురుబ, బోయ కులస్తులకు తెలియజేయడం ఏమనగా మన ఓట్లతో అధికారములోకి వచ్చి మన మీద చేస్తున్న దాడులను హత్యలపై కూటమి ప్రభుత్వన్ని ప్రశ్నించాలి మన సత్తా చూపించాలి.. అందరూ ఒక్కటై త్వరలో అనంత నడిబొడ్డున
” కూటమి ప్రభుత్వంలో బిసిల అణచివేత ”  మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు వైసిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బిల్లే మంజునాథ్ ..
తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ఎన్నికలో తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను ఓటు రూపంలో వాడుకోవడం అధికారములోకి వచ్చాక బీసీలను అణచివేయడం ఆనవాయితిగా వస్తుంది..
తెలుగుదేశం పార్టీకి బిసిల సత్తా చూపిద్దాం రండి కదిలిరండి .రాప్తాడు నియోజకవర్గములో 2029 ఎన్నికల్లో మా బిసిల సత్తా ఏంటో చూపిస్తామని బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బిల్లే మంజునాథ్ హెచ్చరించారు.