బీర్కూర్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
జూలై 24: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో...