బీరంగూడలో అగ్నిప్రమాదం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్

బీరంగూడలో అగ్నిప్రమాదం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పటాన్‌చెరు, జూన్ 29(ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట్ గ్రామం, దుర్గా నగర్ కాలనీలో ఉన్న భార్గవి అపార్ట్మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఇంట్లోని విలువైన గృహోపకరణాలు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు....