prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:01 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ మహిళా నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ మహిళా నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

పటాన్‌చెరు, జూన్ 26(ప్రజావాణి) :పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని ప్రముఖ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షురాలు & టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ వారికి ఆశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ మర్యాదల ప్రకారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను తెలుసుకుని, ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తామని నాయకులు తెలిపారు.