బీజేపీ ఎండోమెంట్ సెల్ పోచారం డివిజన్ కన్వీనర్‌గా నీలం సత్యం గౌడ్ నియామకం
ఘట్‌కేసర్, ఆగస్టు 6: భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ (ధార్మిక విభాగం) జీహెచ్‌ఎంసీ పోచారం డివిజన్ కన్వీనర్‌గా నీలం సత్యం గౌడ్‌ను పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా నీలం సత్యం గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర సహ కన్వీనర్ నిరంజన్ దేశాయ్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ అధిమూలం కరుణాకర్, జిల్లా సహ కన్వీనర్లకు, అలాగే పోచారం డివిజన్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు....