ఘట్‌కేసర్, ఆగస్టు 6: భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ (ధార్మిక విభాగం) జీహెచ్‌ఎంసీ పోచారం డివిజన్ కన్వీనర్‌గా నీలం సత్యం గౌడ్‌ను పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది.
ఈ సందర్భంగా నీలం సత్యం గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర సహ కన్వీనర్ నిరంజన్ దేశాయ్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ అధిమూలం కరుణాకర్, జిల్లా సహ కన్వీనర్లకు, అలాగే పోచారం డివిజన్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధేయుడిగా పనిచేస్తూ ఎండోమెంట్ సెల్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.