బీజేపీ ఎండపల్లి మండల కార్యవర్గ సమావేశం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన నాయకులు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, జూలై 18 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం శనివారం రోజున ఘనంగా నిర్వహించబడింది. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, రైతుల ఇబ్బందులు, తాగునీటి కొరత, దెబ్బతిన్న...