prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:49 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

బీజేపీ ఎండపల్లి మండల కార్యవర్గ సమావేశం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన నాయకులు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, జూలై 18 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం శనివారం రోజున ఘనంగా నిర్వహించబడింది. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ…. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, రైతుల ఇబ్బందులు, తాగునీటి కొరత, దెబ్బతిన్న రహదారులు ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిపై వారు ధ్వజమెత్తారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షులు రావు హనుమంతరావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒరగంటి చంద్రశేఖర్, ధర్మపురి అసెంబ్లీ ఇన్‌చార్జ్ కన్నం అంజయ్య, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, ఎస్‌ఐఆర్ ధర్మారం–ఎండపల్లి మండల ఇన్‌చార్జ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే యువమోర్చా జగిత్యాల జిల్లా కార్యదర్శి ఈర్ల నవీన్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం రమేష్, యువమోర్చా అధ్యక్షులు జక్కుల సాగర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సబ్బు సంతోష్, బీఎంఎస్ అధ్యక్షులు ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శులు పొన్నం నరేష్, మేడిపల్లి రాజశేఖర్, మంచికట్ల రవి, ఉపాధ్యక్షులు గోపనవేని గంగాచలం, కట్కూరి వెంకటేశ్, కార్యదర్శులు మామిడిపల్లి రమేష్, రమేష్, మీడియా కన్వీనర్ జెల్ల శ్రీనివాస్, వివిధ శక్తికేంద్రాల ఇన్‌చార్జ్‌లు, బూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.