ప్రజావాణి మోతే 09: బి ఆర్ర్ ఎస్ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలని పార్టీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు శనివారం మోతే మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ నివాసానికి విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించి బి ఆర్ ఎస్ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు అంశాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్లాలని సంఘం నేతలతో కలిసి వినతి పత్రం అందజేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగులు అనేక సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటు, దుర్భర జీవితాలు గడుపుతున్నారని వికలాంగుల సమస్యల గళాన్ని వినిపించడానికి రాష్ట్రంలో ఉన్న ఏ సకలాంగుల రాజకీయ నాయకుడు ముందుకు రావడం లేదని అందుకే అన్ని రాజకీయ పార్టీలు వికలాంగుల విభాగాలు ఏర్పాటు చేసి వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుందని ఈ క్రమంలోనే బి ఆర్ ఎస్ పార్టీలో వికలాంగులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు ద్వారా,స్వతంత్ర భారత వనిలో 79 ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రాజకీయ అవకాశాలు దక్కడంతోపాటు పార్టీ బలోపేతంలోనూ పార్టీ నిర్ణయాల్లోనూ వికలాంగులకు సరైన ప్రాధాన్యత లభిస్తుందని ముఖ్యంగా బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పార్టీ వికలాంగుల విభాగం ఎంతగానో దోహదపడుతుందని. ఈ మేరకు బి ఆర్ ఎస్ పార్టీ త్వరలో చేపట్టబోయే నూతన కార్యవర్గాల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ వికలాంగుల విభాగాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలైన వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల పోస్టుల భర్తీ మరియు పెన్షన్ల పెంపు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం 2016 వికలాంగుల చట్టం అమలు స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ రిజర్వేషన్ వంటి ఇతర సమస్యలను పరిష్కరించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై బి ఆర్ ఎస్ పార్టీ పరంగా పోరాటం చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి బి ఆర్ ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘం మోతే మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ స్పెరోస్ మండల నాయకుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు