డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు లేవ్:గత 6 నెలలుగా జీతాలు లేక సతమత అవుతున్న సెక్యూరిటీ గార్డ్స్ బ్రహ్మంగారిమఠం సూర్య ప్రతినిధి బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తోట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు జీతాలు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతాలు అందక సతమతం అవుతున్నామని అన్నారు. ఈ క్రమంలో జీతాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ సభ్యులను పోషించడానికి కష్టతరం అవుతుందని తెలిపారు. అందువలన సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలకి వెళ్లడం లేదని వాపోయారు. మాకు జీతాలు అందలేదని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర దృష్టికి తీసుకెళ్తే ఆయన మీరు డ్యూటీలు ఆపేస్తే వేరే వాళ్ళని తీసుకుంటామని తెగేసి చెప్పారని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వారికి జీతాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.