prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 7:14 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులు,ప్రజలతో సమావేశం ..

సిద్దిపేట్, జగదేవ్పూర్, జూన్ 11, ప్రజావాణి

పలుగుగడ్డ గ్రామం ఆదర్శం కావాలి.గ్రామ అభివృద్ధి బాధ్యత మనదే,గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పలుగు గడ్డ ను తీర్చిదిద్దాలి,బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులు,ప్రజలతో సమావేశం,బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి ,సర్పంచ్ నర్ర కనకయ్య, జగదేవపూర్  కలిసి కట్టుగా పనిచేద్దాం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేద్దాం అని గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ,

బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి

అన్నారు, గురువారం మండలం లోని పలుగు గడ్డ గ్రామంలో గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ఉప సర్పంచ్ నర్ర కళ్యాణి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులతో కలిసి ఈసమావేశం నిర్వహించారు, ఈ సమావేశం లో గ్రామంలోనీ గ్రామ నాయకులతో గ్రామస్తులతో ఆదర్శ గ్రామ నిర్మాణం పై సమావేశం ఏర్పాటు,చేసి వివిధ కమిటీ ల అధ్యక్షులను ఏర్పాటు చేశారు.పలుగు గడ్డ గ్రామ కమిటీ అధ్యక్షులుగా కుక్కల ఐలయ్య ను బల వికాస ఆధ్వర్యంలో ఎన్నిక చేశారు,ఈ సమావేశంలో సర్పంచ్ నర్ర కనకయ్య,బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి,మాట్లాడుతూ బాల వికాస గత 40 సంవత్సరాలుగా తెలంగాణలోనే కాక 8 పొరుగు రాష్టాల్లోను పలు గ్రామాభివృద్ధి పథకాలను ప్రారంబించి వాటిని కొనసాగిస్తూ లక్షలాది మందికి లబ్దిని చేకూరుస్తుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక్కరితో సాధ్యం కాదని, గ్రామ పౌరులందరూ ఒకే ఆశయం కొరకు పనిచేస్తే గ్రామంలో మార్పు సాద్యం అవుతుందని సూచించారు. గ్రామాల్లో స్థిరమైన మార్పు కొరకు నాయకులంత కలిసి పనిచేయాలని ప్రజలను కలుపుకొని గ్రామాభి వృద్ధిని సాధించాలని, ఒక్కరుగా చేయలేనిది అందరు కలిస్తే సాద్యం అవుతుంది. గ్రామం ఆదర్శ గ్రామంగా మారాలంటే నాయకులంత ఐకమత్యంతో పార్టీలకు, కుల మత వర్గాలకు అతీతంగా కలిసి పనిచేయాలి. “గ్రామం మనది బాద్యత మనదే” అనే ఉద్దేశంతో ప్రజలలో అవగాహన పెంచుతూ చైతన్యం పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆదర్శ గ్రామ నిర్మాణ పథకం మేనేజర్ తెలియజేసారు.ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కుక్కల ఐలయ్య,మాట్లాడుతూ బాల వికాస సంస్థ ఆధ్యర్యంలో మా గ్రామాన్ని దత్తతు తీసుకున్నందుకు మాకు సంతోషంగా ఉందని, మా గ్రామం లోని ప్రతి వీదిలో నుండి ప్రజలు ఈ పథకం లో సంస్థ మా గ్రామాన్ని దత్తత బాగస్వాములు అయ్యే విదంగా చూసుకుంటామని తెలియజేసారు. గ్రామ పంచాయతి నుండి పూర్తి సహకారం అందిస్తామని, గ్రామ సభకు ప్రతి కుటుంబం కనీసం ఒక్కరైనా హాజరు కావడానికి ప్రయత్నం చేస్తామని. మా గ్రామంలో సంస్థ ద్వారా నిర్వహించే ప్రతి కార్యక్రమం లో ప్రజలను బాగాస్వాములను చేస్తామని. ప్రలందరినీ కలుపుకొని మార్పు దిశగా అడుగులు వేస్తామని తెలియజేసారు.*అనంతరం గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య*మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి బాధ్యత మనదే అని ఆయన ప్రజలకు సూచించారు, అందరం కలిసి ఊరు కోసం పని చేయడానికి సిద్దం ఉండాలని ఆయన అన్నారు,గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలవాలంటే సుపరిపాలన, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, మరియు ప్రజల భాగస్వామ్యం అత్యవసరం. గ్రామస్తులందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆదర్శ గ్రామాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పారు,బాల వికాస సంస్థ సంస్థ మా గ్రామానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు.రాష్ట్రం లో సెలెక్ట్ అయిన 50 గ్రామ పంచాయతీ లో మెదటి గ్రామం గా పలుగు గడ్డ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మన పలుగు గడ్డ గ్రామ ప్రజలందరి బాధ్యత అని చెప్పారు.గ్రామ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని పిలుపును ఇచ్చారు.అనంతరం బాల వికాస సంస్థ వ్యవస్థపాకురాలు మంజుల రెడ్డి నీ మరియు నూతన కమిటీ సభ్యులను సర్పంచ్ నర్ర కనకయ్య ఉప సర్పంచ్ నర్ర కళ్యాణి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు వెంకటేష్,నర్సింలు, కృష్ణ,వినోద,పిట్టల వెంకటేష్, బలమని, హేమలత,మాజీ సర్పంచ్ రాజేశ్వరి రవి, గ్రామ పెద్ద మనిషి నర్ర ఇస్తారీ ఉప పెద్ద మనిషి రామచంద్రం, కమిటీ అధ్యక్షులు నర్ర పెద్ద కనకయ్య,నరేష్,వెంకటేష్,కృష్ణ,రమేష్,గ్రామస్తులు ఎల్లేష్, ఇస్తారీ, నర్సింలు,గ్రామ పెద్దలు గ్రామ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.