prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 4:48 am Digital Edition : PRAJA VANI

బాలిక హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య అనుమానం

బాలిక హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య అనుమానం

మన  ప్రజావాణి  మదనపల్లి 

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కురబలకోట మండలం పరిధిలోని కనసానివారిపల్లి చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లెకు తరలిస్తున్నారు. బాలికపై హత్యాచారం జరిగిన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.