కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) పోరుమామిళ్ల-జర్నలిస్టు గా అనేక దినపత్రికలలో,ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా30సంవత్సరాలపాటు ప్రజాసమస్యలపైఎన్నోకథనాల ను రాసి,వాటిని అధికారులద్వారా కదలికలుతెచ్చిపరిష్కారంచూపడమే కాకుండా ప్రజాసమస్యలపై కళంతోనిరంతరం పోరాటంచేస్తూ,మరొకప్రక్కఎరుకల,యానాదుల కుటుంబాలకు అండగానిలిచిఎన్నో సేవలు అందిస్తూ,అభాగ్యులకు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తూ తన ప్రేండ్స్ ప్రేరణతోపేదలకుఅభా గ్యులకు నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా,తన స్నేహితులతో కలిసి రక్త దానం చేయిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ గుడి మే బాలస్వామిచేస్తున్న సేవలను గుర్తించి శ్రీ పొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా కోటా మండలం విద్యానగర్ లోని ఎం.వి.ఫౌండేషన్ సేవా సంస్థ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం -2026 లోభాగం గా జాతీయ ఉత్తమ సీనియర్ జర్నలిస్టు పురస్కారంఅవార్డ్ ను ఎం. వి.లీల మోహన కృష్ణ, సినీ నటి, యాంకర్, జర్నలిస్టు జ్యోతి, సినీ ఆర్టిస్టు మోహన్, కొరియోగ్రా ఫర్ టిట్లు భాయి చేతుల మీదుగా ప్రధానాత్సోవం చేశారు.కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి గ్రామానికి గుడిమే బాలస్వామి 30 సంవత్సరాలనుండి జర్నలిస్ట్ గా సేవలుఅందిస్తున్నారు.అనేకదినపత్రికలలో పని చేశారు.ప్రస్తుతంఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సేవలు ఇప్ప టికి అందిస్తున్నారు.కాశినాయన మండలం ఆకునారాయణపల్లి యానాదులు సమసమాజానికి దూరంగా ఉంటూ జనాలను చూస్తే పారిపోయే వారితో స్నేహం చేసి వారి స్థితిగతులపై తన కళంతో పనిచెప్పడంతో జిల్లా అధికారుల లో కదలిక తెచ్చి వారిని సమాజాని కి దగ్గరచేసి,ఇల్లు,భూములుఇప్పిం చడంలో కీలకపాత్ర పోషించారు.రెడ్డికొట్టాల యానాదులపై ప్రత్యేక కథనాలు రాసి అప్పటి ఎమ్మెల్యే గోవిందరెడ్డినేకదిలించిఇల్లు,భూములు మంజూరు చేయించారు. వరికుంట్ల యానాదులకుప్రభుత్వం
ద్వారా భూములు మంజూరు చేయించడంలోకీలకపాత్రపోషించారు.పేదవానికి భూసమస్యలువచ్చినా అక్కడతన కళంకుపనిపెడుతూ అందరికివెన్నుదన్నుగా నిలుస్తున్నారు.వార్తల విషయంలో ఎక్కడరాజీ అనేదిచూడడు.వీటన్నింటికిగుర్తించిన ఎం. వి.ఫౌండేషన్ సేవా సంస్థ సామాజికసేవాకార్యక్రమాలుచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారంఅందించారు.ఈఆవార్డు నాకు మరింత బాధ్యత పెంచిం దని ఈసందర్భంగా బాలస్వామి తెలిపారు. నాకు సహకారాన్ని అందించిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.