బాలవికాస ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
* గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్యరవికుమార్
* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన కోఆర్డినేటర్లు సుమలత స్వాతి ఆసియా
* గ్రామ ఉపసర్పంచ్ ఇంగ్లే లక్ష్మయ్య గ్రామ కార్యదర్శి సుమలత వార్డు సభ్యులు
జమ్మికుంట జులై 31 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లాఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారుఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్యరవికుమార్ మాట్లాడుతూఆసుపత్రులకు వెళ్లలేని సామాన్య ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి వ్యక్తి రోజూ తగిన మోతాదులో మంచినీరు తాగాలని, తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశంఉందనిసూచించారుహాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు గర్భాశయ సంబంధిత సమస్యలు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే సీజనల్ వ్యాధులపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని సూచించారుకారోబర్ తిప్పారపు వీరన్న మాట్లాడుతూ గ్రామంలోని మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను వైద్యులు ఓపికగా విని తగిన సూచనలు సలహాలు అందించారనితెలిపారుఅవసరమైన వారికి షుగర్ రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని చెప్పారుఈ కార్యక్రమంలో జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన కోఆర్డినేటర్లు సుమలత స్వాతి ఆసియా హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంకీర్తన పీఆర్‌వో బిక్షపతి సంపత్ రెడ్డి రాజేష్ సిబ్బంది ప్రసన్న భారతి కృష్ణవేణి గ్రామ ఉపసర్పంచ్ ఇంగ్లే లక్ష్మయ్య గ్రామ కార్యదర్శి సుమలత వార్డు సభ్యులు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి గొడుగు మానస గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
