బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఘట్‌కేసర్, జూలై 7: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో మాజీ కౌన్సిలర్ కడుపపొల్లా మల్లేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్‌కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్...