బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి”ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్

ప్రజావాణిన్యూస్కడప మార్చి24:సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది,పోలీస్ స్టేషన్ లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని...