prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 3:02 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

బాధితురాలి కుటుంబానికి మంత్రి అడ్లూరి పరామర్శ

ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పత్తిపాక మునిలత కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 10 వేల తక్షణ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.