prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 0001, 1:06 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బాకీ డబ్బులు అడిగినందుకు బెదిరింపులకు దిగుతున్న అప్పు తీసుకున్న వ్యక్తులు.బాధిత మహిళ షేక్ హసీనా

విజయవాడ:మే 19 ప్రజావాణి నా బిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.సదరు బాకీదాడులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా,నందిగామ పట్టణం ఖాజానిపురంకు చెందిన షేక్ హసీనా పోలీస్ అధికారులను వేడుకున్నారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో షేక్ హసీనా మాట్లాడుతూ తన రెండవ కుమారుడైన షేక్ గౌస్ మొబైల్ షాపును నడుపుతూ కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ముఖేష్ కుమార్ జైన్ 75 లక్షలు రెండు దఫాలు అప్పుగా ఇచ్చాడనీ.అప్పు తీసుకున్నట్లు వారు ప్రాంసరీ నోట్లు, అగ్రిమెంట్లు,ఖాళీ చెక్కులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తమ డబ్బులు తిరిగి చెల్లించమని అడుగుతుంటే”నయాపైసా ఇవ్వనని కోర్టు కేసు వేసుకోమని చెప్పగా షేక్ గౌస్ కోర్టులో కేసు దాఖలు చేశాడని వివరించారు. సదరు కేసు నోటీసు పంపిన దగ్గర నుండి ముఖేష్ కుమార్ జైన్ చెన్నుపాటి శ్రీను తో కలసి బెదిరింపులకు పాల్పడుచున్నాడనీ,చెన్నుపాటి శ్రీను ఫోన్ చేసి ఇకపై ముఖేష్ కుమార్ జైన్ వద్ద నుండి రావలసిన డబ్బులు అడుగవద్దని, ఆ డబ్బులు వదిలివేయాలని,కేసును వాపసు తీసుకోవాలని అసభ్యంగా మాట్లాడుతున్నారు.రౌడీలతో కలిసి చంపేస్తామని అంటున్నారు.చాణిక్య,రెడ్డిపల్లి పండు,ప్రేమ్ అనే వ్యక్తులు కొత్త కొత్త నెంబర్స్ నుండి ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ మా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసారు.పోలీస్ వారు ముఖేష్ కుమార్ జైన్ అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకొని,వారి నుండి తమకి రక్షణ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మౌలాలి,ఎస్.కె గౌస్ తదితరులు పాల్గొన్నారు