బరిగెలపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయానికి భూమి పూజ
మన ప్రజావాణి, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బరిగెలపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూమి పూజను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి సన్నీల కవిత వెంకటేష్ మాట్లాడుతూ..... ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం గ్రామానికి శుభప్రదమని పేర్కొన్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని...